వివేకా హత్య కేసు: 95వ రోజుకు చేరిన సీబీఐ విచారణ

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 95వ రోజుకు చేరింది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. గురువారం పులివెందులకు చెందిన ఉమా శంకర్ రెడ్డి, భారత్ కుమార్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. మరికొంతమంది అనుమానితులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసులు విచారణ కీలక దశకు చేరుకుంటోంది. ఇప్పటికే చాలా మందిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. అనుమానితుడు సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్ తర్వాత కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/