మంత్రి గంగుల కమలాకర్ కు CBI నోటీసులు

టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కు CBI షాక్ ఇచ్చింది. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేశారు. ఇప్పటకే మైనింగ్‌ వ్యవహారంలో ఈడీ దాడులను ఎదుర్కొంటున్న మంత్రి మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నుంచి నోటీసులు అందడం చర్చ గా మారింది. కమలాకర్ తో పాటు ఎంపీ గాయత్రి రవికి కూడా నోటీసులు అందాయి.

గతంలో విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ సీబీఐ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. తాను సిబిఐ అధికారిని అంటూ చెలామణి అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ ఇటీవల కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ తో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మంత్రి గంగుల ను సాక్షిగా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగులకు , శ్రీనివాస్ కు మధ్య సంబంధాలపై అధికారులు విచారించనున్నట్టు తెలుస్తుంది.

సిబిఐ నోటీసుల ఫై గంగుల స్పందించారు. తన ఇంటికి సిబిఐ అధికారులు రావడం నిజమే అన్నారు. నాల్గు రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ ఆఫీసర్ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత నాతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ అధికారులు ఆ కేసులో నన్ను సాక్షిగా పరిగణించి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. నేను రేపు ఢిల్లీకి వెళతాను. జరిగింది ఏంటో సీబీఐ వివరిస్తానని మంత్రి తెలిపారు.