వివేకానందరెడ్డి హత్యకేసుపై విచారణ తిరిగి ప్రారంభం

నేడు కొందరు కీలక వ్యక్తులను విచారించనున్న అధికారులు

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఏడు నెలల తర్వాత మళ్లీ మొదలుకానుంది. గతేడాది కేసును విచారిస్తున్నసీబీఐ అధికారులు కొందరు కరోనా బారినపడడంతో దర్యాప్తు అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో తిరిగి నిన్న కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు నేటి నుంచి విచారణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులకు నోటీసులు పంపిన అధికారులు నేటి విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం ఆగిపోయిన విచారణ నేటి నుంచి మళ్లీ మొదలు కానుంది.:

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/