వైఎస్ వివేక హత్యకేసు..విచారణకు వైఎస్ సోదరుడు
అనుమానితులతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తోన్న అధికారులు
vivekananda reddy
కడప :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ 94వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో ఈ రోజు కూడా అధికారులు పలువురిని విచారిస్తున్నారు. ఈ రోజు విచారణకు వివేకా సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి హాజరు కావడం గమనార్హం.
అనుమానితులతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసు గురించి మరింత సమాచారం సేకరించడంలో భాగంగా సుధీకర్ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అనుమానితులు, సాక్షులను విచారించిన సీబీఐ అధికారులు కీలక వివరాలు రాబట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/