‘చంద్రన్న కానుక’పై సిబిఐ విచారణ: కేబినేట్‌ నిర్ణయం

నివేదికను కేబినేట్‌ ముందుంచిన సబ్‌కమిటీ

AP CM YS Jagan-Chandra babu
AP CM YS Jagan-Chandra babu

Amarvati : గత తెదేపా ప్రభుత్వ హయాంలో అక్రమాలపై రాష్ట్రప్రభుత్వం కేబినేట్‌లో సంచలన నిర్ణయాలు తీసుకుంది..

చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, ఎపి ఫైబర్‌ గ్రిడ్‌లో అక్రమాలపై సిబిఐ విచారణ కోరాలని కేబినేట్‌నిర్ణయించింది.

గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినేట్‌ సబ్‌కమిటీ నివేదిక అందజేసింది..

సబ్‌కమిటీ సూచన మేరకు సిబిఐ విచారణ కు ఆదేశించింది..

ఇదిలా ఉండగా కేబినేట్‌ వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి ఆమోదం తెలిపింది..

ఎస్సీ, ఎస్టీ, బిసి మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేలు చొప్పున సాయం చేయాలని నిర్ణయించింది.. కాగా వచ్చే ఆగస్టు 15న ఈ పథకాన్ని సిఎం జగన్‌ ప్రారంభించనున్నారు..

అంతేకాకుండా రామాయణం పోర్టుకు ఆగస్టునాటికి టెండర్లు పిలవాలని కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది..

ఈనెల 16నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 16నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజునే బిఎసి సమావేవం కూడ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/