వ్యక్తిగత హాజరు నుంచి సీఎం జగన్ కు మినహాయింపు

అమరావతి: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల విచారణ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కేసులో జగన్ బెయిల్ పై ఉన్నారు. ప్రతి శుక్రవారం న్యాయాస్థానానికి హాజరవుతూ వచ్చారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సిపి పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. పరిపాలనా వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి హోదాల్లో వైఎస్ జగన్..సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సి వస్తే 60 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఖర్చు చేయాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలను విన్న తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి సీఎం జగన్కు మినహాయింపు ఇచ్చింది.
తాతా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/