ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు

రూ.237 కోట్లు రుణాలను ఎగగొట్టినట్లు ఆరోపణలు

MP Raghuram Krishnaraja
MP Raghuram Krishnaraja

Narasapuram: నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు నమోదైంది. ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన రఘురామ కృష్ణంరాజు‌ కంపెనీ రుణంగా పొందిన రూ. 237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు సీబీఐకి చెన్నై ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్‌ ఫిర్యాదు చేశారు. మార్చి 23న రవిచంద్రన్‌ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. 

రూ.237 కోట్లు రుణాలను ఎగగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంద్‌ భారత్ పవర్ లిమిటెడ్  డైరెక్టర్ గా ఉన్న ఎంపి రఘురామ కృష్ణంరాజుతోపాటు ఇతర డైరెక్టర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/