రూ.7వేల కోట్ల మోసంపై సిబిఐ దాడులు

ఏకకాలంలో 169 కేంద్రాల్లో సోదాలు

cbi
cbi

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తుసంస్థ బ్యాంకుల్లోమోసాలుచేసిన వారి కేసుల దర్యాప్తును వేగవంతంచేసింది. ఏడువేల కోట్ల విలువైన బ్యాంకు మోసాలకేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తుసంస్థ సిబిఐ మంగళవారం సుమారు169 కేంద్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సిబిఐకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరుమాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, ఛండీఘర్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, కేరళ,మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దాద్రా నాగర్‌ హవేలి రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిందని చెపుతున్నారు. ఎక్కువగా బ్యాంకుల్లో జరిగినమోసాలపైనే సిబిఐ అదికారులు ఈ దాడులు నిర్వహించారు. వారిలో ఎక్కువగా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ వర్గాలే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. వీటిలో రాజకీయ నేపథ్యం ఉన్న కేసులు కూడా లేకపోలేదు. గడచిన రెండుదశాబ్దాలుగా పేరుకున్న బకాయిలు రికవరీకోసం కొన్ని ఎన్‌సిఎల్‌టికి దాఖలయితేమరికొన్ని బ్యాంకులే స్వయంగా ఇచ్చిన ఫిర్యాదులమేరకు సిబిఐ దర్యాప్తును వేగవంతంచేసింది. ఇప్పటికే కొన్ని కేసులు దర్యాప్తుచేయగా మరికొన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లునమోదుచేసి దాడులుచేస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/