ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు : హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే CID అధికారులు పలు రాష్ట్రాల్లో పలువురు నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ లపై దాడులు జరపడం..పలువుర్ని విచారించడం చేసారు. అంతే కాదు ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్టు చేసారు సీబీఐ . హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అభిషేక్‌ బోయినపల్లిని సీబీఐ కోర్టులో హాజరుపరచనుంది. ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసింది సీబీఐ. విజయ్‌ నాయర్‌ను, సమీర్ మహేంద్రును అరెస్టు చేసిన సీబీఐ .. విజయ్‌ నాయర్‌ తర్వాత హైదరాబాద్​కు చెందిన అభిషేక్‌ బోయినపల్లిని అదుపులోకి తీసుకుంది.

అభిషేక్ రావు రాబిన్ డిస్టిలరీస్‌లో డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అనూస్ బ్యూటీపార్లర్‌లోనే డిస్టిలరీస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి ఆయన వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది. 9 కంపెనీల్లో అభిషేక్ రావు డైరెక్టర్‌గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా.. అభిషేక్ రావు అరెస్ట్ రెండోది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశముందనే చర్చ నడుస్తోంది.