ఐఎస్‌ఐ కుట్ర కారణం : నిఘా ఏజెన్సీలు

New Delhi: ఢిల్లిలో జరిగిన హింసాకాండకు పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) కుట్ర కారణమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాక్‌లోని బాలాకోట్‌లో భారత్‌ వైమానిక దళం (ఐఎఎఫ్‌) దాడి, తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటన విజయవంతం కావడంతో దేశ రాజధానిలో మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి ఐఎస్‌ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో ఉన్న కొంతమంది అండర్‌వరల్డ్‌ కార్యకర్తలు ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేయడానికి, హింసాకాండకు పాల్పడటానికి భారత్‌లో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్లు నిధులు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తమ భారత వ్యతిరేక ప్రణాళికను అమలు చేయడానికి ఐఎస్‌ఐ అత్యున్నత నాణ్యత కలిగిన దొంగ నోట్లను నేపాల్‌, దుబాయ్‌ల ద్వారా భారత్‌లోకి చొప్పిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ దొంగనోట్లు అసలు నోట్లపై ఉన్న 9 భద్రతాంశాల్లో 7 అంశాలను పోలి ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సాధారణ పౌరులకు ఈ నోట్లను గుర్తించడం అసాధ్యమని నిఘా వర్గాలు తెలిపాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/