గంజాయి విషయంలో పోలీసులు చేసే పనిని బిజెపి నేత చేసాడు

హైదరాబాద్ లో గంజాయి విక్రయం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ఈ గంజాయి కి అలవాటు పడి నేరాలు చేస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తున్న పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మొదటి నుండి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనికి ఉదాహరణే ఈ ఘటన. బొల్లారంలో పోలీసులు చేయాల్సిన పనిని బిజెపి నేత చేసి స్థానికుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

బొల్లారంలోని సుల్తాన్ పూర్ పరిధిలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నా అధికారులు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. లక్షల్లో వ్యాపారం సాగుతున్నప్పటికీ పోలీసులు చూసి చూడనట్లుగా తనిఖీలు చేప‌డుతున్నారు. జిన్నారం మండల కేంద్రంలోని బొల్లారంలో మంగళవారం తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా 20 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న బిజెపి నాయకుడు ఆనంద కృష్ణ రెడ్డి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఒక పోలీసు అధికారులు చేసే పనిని ఒక నాయకుడు చేయడంతో బొల్లారం గ్రామ ప్రజలు యువత తల్లిదండ్రులు ఆయనను అభినందించారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించి గంజాయ్ గుట్కా విక్రయాలు చేసే డాన్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించాలని ప్రజలు వేడుకుంటున్నారు.