రుణభారం రూ.5.3లక్షల కోట్లు

CASH
CASH

రుణభారం రూ.5.3 లక్షల కోట్లు

ముంబయి: రైతు రుణమాఫీలకు ఆర్ధిక సహకారం, ఎన్నికలకు ముంచుకొస్తున్న తరుణంలో చేస్తున్న కొత్తపథకాల వ్యయం వంటివి కొంతమేరాష్ట్రాల ఆర్ధిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందన్న సర్వేలు నిజంఅవుతున్నాయి. పంటరుణాల మాఫీకి నిధులు అందించడం, ఎన్నికల సంబంధిత వ్యయం,ప్రకృతి వైపరీ త్యాలు వంటివాటితో రాష్ట్రాలు ఆర్ధిక స్థిరత్వ చేకూర్పు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నట్లు ఇక్రా రేటింగ్స్‌సంస్థ వెల్లడించింది.

దీనితో 2019 ఆర్ధికలక్ష్యాలు మిస్‌ కావడంతోపాటు రాష్ట్రాల రుణభారం 5.3 లక్షలకోట్లకు పెరుగుతుందని అంచనా. రాష్ట్రాల ఆర్ధికలోటు ముఖ్యంగా రాష్ట్రా లకు ఇచ్చే అభివృద్ధి రుణాలతో కొంత భర్తీ అవుతుంది. ఏప్రిల్‌ ఆగస్టు నెలల్లో స్థూలంగా ఈ అభివృద్ధి రుణాలు 3.4శాతం తగ్గి 1.32 లక్షలకోట్లకు చేరాయి. యుపి,మహారాష్ట్ర, గుజ రాత్‌ వంటి రాష్ట్రాల్లోనే ఈ లోటు కనిపిస్తోంది. ఈమూడింటిని మినహాయిస్తే మొత్తం రాష్ట్ర అభివృద్ధిరుణాలజారీ మిగిలినరాష్ట్రాల్లో 14.7 శాతంపెరిగింది. అంతేకాకుండా 1.3 లక్షల కోట్ల అభివృద్ధి రుణాలను 2019లో చెల్లించాల్సి ఉంది.

ఈ ఏడాది ఆఖులోపు 0.8 లక్షలకోట్లు చెల్లించాలిస ఉంటుంది. దీన్నిబట్టి చెల్లించాల్సిన మొత్తం భారీగానే ఉంది. వార్షికంగా వృద్ధి 10-20శాతంగా ఉంది. మొత్తం రాష్ట్ర అభివృద్ధి రుణాలపరంగా 3.4 లక్షలకోట్లు జారీ అయితే 2019 నాటికి ఐదునుంచి 5.3లక్షలకోట్లకు పెరుగుతుందని అంచనా. 2018లో ఈ మొత్తం 4.2లక్షలకోట్లనుంచి భారీగా పెరుగుతుంది. మొ త్తం 29 రాస్ట్రాల ఆర్ధికలోటుస్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 2.6శాతంగా ఉంటుందని అంచనా.

ఈ ఏడాదిలో అయితే 3.1శాతంనుంచి కొంత తగ్గుతుందని అంచనా. మొత్తం 29 రాష్ట్రాల సమిష్టి జిఎస్‌డిపి లో 62శాతంగా తొమ్మిది రాష్ట్రాల బడ్జెట్లు ఉన్నాయి. విశ్లేషణలో ఎన్నిక లకు వస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మొత్తం రాస్ట్రాలపరంగాచూస్తే 2019 నాటికి సార్వత్రిక ఎన్నికలుసైతం ఎదుర్కొంటాయి. అనుకోని విధంగా ఎదురయిన కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రకృతి వైపరీత్యాలు రాబడులను దెబ్బతీసాయి. వీటితోపాటువాటి ఆర్ధిక వ్యత్యాసాలపై కూడా ఒత్తిడినిపెంచాయి. రెవెన్యూ వ్యయంపరంగా కూడా కొంత తగ్గాల్సిన అవసరం ఉంది. ఇక ఐజిఎస్‌టి, జిఎస్‌టి పరిహారం సెస్‌ వంటి వాటితోపాటు ఎస్‌జిఎస్‌టి రాబడులు కొంత వృద్ధికి ఆస్కారం ఉంటుందని ఇక్రా విశ్లేషించింది. ఈఏడాది ఇప్పటివరకూ జిఎస్‌టి పరిహారం రూపంలో రూ.3900 కోట్లకు మాత్రమే పరిమితం అయింది. జూన్‌జులై నెలలకు రూ.14,930 కోట్లుగా ఉంది.

జిఎస్‌టి పరిహారం సెస్‌ పరిమితులు పరిహారం నిధులకు మించి ఉన్నాయి. జిఎస్‌టి పరిహారం సవరణ బిల్లుప్రకారం 50శాతం వినియోగం కాని మొత్తం పరిహారం నిధివద్ద మూలుగుతోంది. ఇటీవల వచ్చిన కొత్త ఐజిఎస్‌టి సవరణలప్రకారంచూస్తే ఐజిఎస్‌టిలో అపరిష్కృతంగా ఉన్న సొమ్ము నుకేంద్రం, రాష్ట్రాలమధ్య సమంగా విభజిస్తారు. దీనివల్ల రాష్ట్రాలకు వచ్చే నిధులపై ప్రభావం పడుతుందని ఇక్రా వెల్లడించింది. ఇక స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులరూపంలో వచ్చే ఆదా యం రాస్ట్రాలకు బడ్జెట్‌ చూపించిన కేటా యింపుల్లోనే 9.7శాతం తగ్గుతుందని అంచనా. వడ్డీరేట్లు పెరుగుతుండటంతో రియల్‌ఎస్టేట్‌రంగం మందగిస్తుందన్న అంచనాలే ఇందుకుకారణమని ఇక్రా విశ్లేషించింది.