అక్రమాస్తుల కేసు విచారణకు సిద్ధంగా ఉండాలి: సీబీఐ

ఈడీ నమోదు చేసిన కేసు విచారణ ఆగస్టు 6కి వాయిదా

AP CM YS Jagan
AP CM YS Jagan

అక్రమాస్తుల వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ పై ఈడీ నమోదు చేసిన కేసులో విచారణ ఆగస్టు 6వ తేదీకి వాయిదా పడింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై విచారణ చేపట్టొచ్చంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం తీర్పు వాయిదా పడింది. కాగా హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను నిలిపివేయాలన్న జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మెమోను పరిశీలించిన సీబీఐ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జగన్‌, విజయసాయిరెడ్డిని కోర్టు ఆదేశించింది. ఎమ్మార్‌ అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసులపై విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/