నారా లోకేష్ పై మర్డర్ కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు

nara lokesh
nara lokesh

తెలుగుదేశం నేత పట్టాభి..వైసీపీ సర్కారు ఫై , జగన్ ఫై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఫై దాడి చేసారు. పట్టాభి ఇంటిపై సైతం దాడి చేసి ఫర్నిచర్, కార్లు ధ్వసం చేసారు. వైసీపీ కార్యకర్తల దాడికి నిరసన గా తెలుగుదేశం పార్టీ..ఈరోజు ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఉదయం నుండే కార్య కర్తలు రోడ్ల పైకి చేరుకోవడం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా తెలుగు దేశం పార్టీ జాతీయ నాయకులు నారా లోకేష్‌ పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.
మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేశారు. ఈ కేసు లో ఏ1 గా లోకేష్, ఏ2 గా అశోక్ బాబు, ఏ3 గా ఆలపాటి రాజా, ఏ4 గా తెనాలి శ్రావణ్ పేర్లను చేర్చారు పోలీసులు. అంతేకాదు… .హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కూడా నమోదు చేశారు.