వనమా, ఆయన కుమారుడుపై కేసు నమోదు

Vanama Venkateswar Rao
Vanama Venkateswar Rao

కొత్తగూడెం: టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవేంద్రరావుపై పోలీసు కేసు నమోదైనట్లు సిఐ కరుణాకర్‌ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్‌ వద్ద అటవీ భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేసేందుకు ఇటీవల అటవీ అధికారులు ప్రయత్నించగా, వారిని అక్కడ ఉన్న గిరిజన సాగుదారులు అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని వనమా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆయన అటవీ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేంద్రరావు, మాజీ ఎంపిటిసి పూనెం శ్రీను తదితరులపై కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/