ఆమంచి కృష్ణమోహన్‌పై కేసు నమోదు

amanchi krishna mohan
amanchi krishna mohan


ప్రకాశం: చీరాల వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్‌పై కేసు నమోదైంది. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కార్యకర్తలతో ఆమంచి సమావేశం నిర్వహించారు. సమావేశానికి అనుమతి లేదంటూ ఆమంచిని పోలీసులు నిలదీశారు. దీంతో పోలీసులతో ఆమంచి వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారంటూ పిఎస్‌లో సిఐ ఫిర్యాదు చేశారు. ఇటు సిఐపై ఆమంచి ఈసికి ఫిర్యాదు చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/