చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌పై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్ 420, 384, 431, రెడ్‌విత్ 34 ఐపిసి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం జానంపేటలో సాగునీటి పైపులు మాయమయ్యాయి. దీనిపై ఓ రైతు ఫిర్యాదు మేరకు ఏ1గా చింతమనేనితో పాటు మరో ఐదుగురు అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/nri/