జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైస్సార్సీపీ ఫిర్యాదు

అనంతపురం : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఆయన మీసం మెలేసి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్‌రెడ్డిపై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయం ఏమిటో ఇక నుంచి తాను చూపిస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని హెచ్చరిస్తూ మీసం మెలేశారు. టీడీపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌.. వైస్‌ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని తన సత్తా ఏమిటో పెద్దారెడ్డికి మరోసారి నిరూపించానని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను గానీ, కొడుకు, భార్య గానీ తమ తడాఖా ఏమిటో జేసీ సోదరులకు చూపిస్తామని ప్రగల్భాలు పలికిన పెద్దారెడ్డి చివరికి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవాచేశారు. నిన్న జిల్లాలోని పది మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్ల ఎన్నిక ముగిసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/