మరో టిడిపి ఎమ్మెల్యే పై కేసు నమోదు

ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు

tdp
tdp

కృష్ణా జిల్లా: ఏపిలో మరో టిడిపి ఎమ్మెల్యెపైపై పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో ఓటర్లకు దొంగపట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. మొన్నటి ఎన్నికల సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని బాపులపాడు తహశీల్దార్ నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. కాగా, మొన్నటి ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వంశీ తన అనుచరులతో కలిసి బాపులపాడు మండలంలోని పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపులపాడు సహా పలు గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేసినట్టు సమాచారం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/