భారత్: ముందుచూపుతో మూడో దశపై దృష్టి

ముందస్తు ప్రణాళిక సిద్ధం

Carona_Focus on the third stage with front sight

New Delhi: భారతదేశంలో కరోనా వైరస్‌ సాంకేతికంగా రెండో దశలోనే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో మూడో దశ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నది.

ఒకవైపు రెండోదశ తాలూకు జాగ్రత్త చర్యలను తీసుకుంటూనే, మూడోదశలో తీసుకోవాల్సిన చర్యలకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నది.

సామూహిక వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రయివేటు ఆసుపత్రుల్ని, లేబొరేటరీలను కూడా భాగస్వాముల్ని చేస్తున్నది.

ముఖ్యంగా మహరాష్ట్రలాంటి చోట్ల ఇలాంటి చర్యలు సత్వరం అనివార్యమవుతున్నట్టు కేంద్రం గుర్తించింది.

ఐసొలేషన్‌ వార్డులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి వస్తుందన్న ఆలోచనతో ఎన్నెన్ని ఇండిపెండెంట్‌ రూములు, బెడ్లు అవసరమవుతాయన్న అంచనాల తయారీలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉన్నట్టు తెలుస్తున్నది.

హెల్త్‌కేర్‌ వర్కర్లకు పెద్ద ఎత్తున శిక్షణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఒకవేళ కరోనా వ్యాప్తిలో దేశం గనక మూడో దశలోకి ప్రవేశిస్తే హెల్త్‌ ప్యాకేజీలను, ఇతర ప్రొటోకాల్స్‌ను సిద్ధం చేయాలని ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్యబీమా పథకానికి నోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తున్న నేషనల్‌ హెల్త్‌ అథారిటీని ఆదేశించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/