కొవిడ్‌ లక్షణాలు ..

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, తలనొప్పి, కండరాల నొప్పి ఉంటాయి. న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. శ్వాసకోశ నాళం పైభాగాన్ని ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా బాధిస్తుంది. గొంతులోకి నీళ్లు దిగడం చాలా కష్టంగా ఉంటుంది. విపరీతమైన ఛాతి నొప్పి ఉంటుంది. మూత్రం పరిణామం తగ్గి అవయవాల పనితీరు దెబ్బతింటుంది. తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గుతుంది.

Covid cases

వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఓ కరపత్రాన్ని విడుదల చేసింది.

జాగ్రత్తలేమిటంటే.. జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రదేశాల్లో వీలైనంత వరకు వెళ్లకూడదు.

దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.

పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.

గర్బిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలి ప్రదేశాల్లో తిరగకూడదు.
దగ్గినా, తుమ్మినా చేతి రుమాలు నోటికి అడ్డుపెట్టుకోవడంతో పాటు మాస్క్‌ ధరించాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/