టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న వోజ్నియాకి

Caroline Wozniacki
Caroline Wozniacki

డెన్మార్క్‌: మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ చాంపియన్‌ కరోలినా వోజ్నియాకి టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పనుంది. డెన్మార్క్‌కు చెందిన కరోలినా వోజ్నియాకి వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు రిటైర్‌మెంట్‌ పలుకుతానని తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్‌లో పోస్టు చేసింది. టెన్నిస్‌లో తాను కోరుకున్నవన్నీ సాధించానని, తన జీవితంలో ఆట కంటే ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సమయం వస్తే టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని అనుకున్నానని తన ట్విట్టర్‌లో పేర్కొంది. గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెలిచిన వోజ్నియాకి తన కెరీర్‌లో 30 సింగిల్స్‌ టైటిల్స్‌ను గెలించింది. 15 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా మారిన వోజ్నియాకి 2010లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకును దక్కించుకుంది అంతేకాదు ఆ స్థానంలో ఏడాదికిపైగా కొనసాగింది వోజ్నియాకి. తన కెరీర్‌లో గెలిచిన ఏకైక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఇదే కావడం కూడా విశేషం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/