నూతన ఏడాదిలో కొత్త భవిత కోసం

కెరీర్‌: విద్య, ఉపాధి, వికాసం

career-For a new future in the new year
career-For a new future in the new year

ఉద్యోగాల స్వభావాల్లో పెనువేగంతో మార్పులు వస్తున్నాయి. నిరంతరం నేర్చుకుంటూ, పరిజ్ఞానం పెంచుకోవడం అనివార్యమై పోయింది. విద్యార్థులైనా, ఉద్యోగులైనా పది మందిలో ఒకరుగా ఉంటే ఫలితం ఉండదు. ప్రత్యేకత చూపిస్తేనే మనుగడ. వ

్యక్తిగతంగా ఎదుగుతూ, కెరియర్‌పరంగా చక్కని పునాది వేసుకోవడానికి తోడ్పడే తీర్మానాలు చేసుకోవడం ఒక ఎత్తయితే, వాయిదా వేయకుండా ఆ నిర్ణయాలనుఅమలు చేయడం మరో ఎత్తు. రానున్న కొత్త సంవత్స రంలో దృష్టిపెట్టి ఆచరిం చాల్సిన ముఖ్యమైన అంశాలెన్నో ఉన్నాయి.

అవి:

నిరంతర నెట్‌ వర్కింగ్‌ ప్రతి విద్యార్థీ, ఉద్యో గార్థీ తప్పనిసరి గా నేర్చుకోవాల్సి న నైపుణ్యమిది. విద్యార్థి దశలో, ఉద్యోగాన్వేషణ తరు ణంలో నెట్‌వర్కింగ్‌ ప్రాధా న్యం అంతా ఇంతా కాదు. పాత మిత్రులకే పరిమితం కాకుండా విభిన్న నేపథ్యాల కొత్త స్నేహితు లను ఏర్పరచుకోవడం, వారితో తరచూమాట్లాడుతుండడం అలవాటు చేసుకుంటే వ్యక్తిగతంగా, కెరియర్‌ పరంగానూ ప్రయోజన కరమవుతుంది.

భావ వ్యక్తీకరణ శక్తిని మెరు గుపరు స్తుంది. నెట్‌ వర్క్‌ విస్తృత మైతే అద నపు నైపు ణ్యాలను పెం చుకోవడం సులువు అవు తుంది. ఎంచుకు న్న పరిశ్రమకు సంబంధించిన సెమి నార్లు, వర్క్‌షాపులు, వెబినార్లు లాంటి కార్య క్రమాల్లో పాల్గొంటూ వుండాలి. ఇలా చేస్తే అనుభవజ్ఞులైన వారిని కలుసుకుని, వారి పరిజ్ఞానం గ్రహించే అవకాశం ఏర్పడుతుంది.

నైపుణ్యాల నవీకరణ..

ఒకప్పటిలా కొలువుల్లో స్థిరత్వం తగ్గిపోయింది. ఉద్యోగ భద్రత ప్రశ్నా ర్థకమవుతూ అనిశ్చితి సర్వసాధారణ మైంది. ఏ కార ణం వల్ల నైనా సిబ్బందిని తగ్గిం చుకోవాలని కంపెనీలు భావిస్తే మొదట వేటు పడేది అతి తక్కు వ నైపుణ్యాల వారిపైనే.

ఈ పరిస్థి తుల్లో వీలైనంత ఉద్యో గాన్ని కాపాడుకోవాలంటే ఎంచు కున్న రంగంలో తాజాఅంశాల పరిజ్ఞానం, సరికొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. పోటీలో వెనకబడి కను మరుగుకాకుండా ఉండాలంటే నైపుణ్యాలను ఎప్పటి కప్పుడు ఆధునికీకరించుకుంటూ ఉండాల్సిందే.

ఉద్యోగార్హతల జోడింపు

సుశిక్షితులైన ప్రతిభావంతులను నియమించుకోవ డానికే సంస్థలు మొగ్గు చూపుతుంటాయి. ప్రసిద్ధ విద్యాసంస్థలో చదివి కేవలం డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రానే ఉద్యోగా ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపవు. వారికి కావాల్సింది విభిన్న నైపుణ్యాలున్న అభ్య ర్థులు.

ఓ సంస్థలో డేటా అనలిస్టు పోస్టు కోసం ఇద్దరు ఫ్రెష ర్లు దరఖాస్తు చేసుకుంటే వారి లో ఒకరికి అత్యు త్తమ మార్కులతో డిగ్రీ, డేటా సైన్స్‌ పై ప్రాథమిక అవ గాహన, మరొకరికి డిగ్రీ, డేటా సైన్స్‌లో తగినంత పరిజ్ఞానంతో పాటుప్రాక్టికల్‌ నైపుణ్యాలు, తగిన సర్టిఫికేషన్లు కూడా ఉంటే నిశ్చయంగా రెండో అభ్యర్థికే ఉద్యోగం దక్కుతుంది.

సోషల్‌ మీడియాకు స్వల్ప సమయం నిద్ర లేవగానే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామా ిక మాధ్యమాలు అకౌంట్లు చెక్‌ చేసుకోవడం, రోజులో ఎక్కువ భాగం దానిలోనే గడపటం చాలా మంది విద్యార్థుల, ఉద్యోగార్థులకు అలవాటు. ఇదివారి విలువైన సమయాన్ని హరించి వేస్తోం ది. వీలైనంత తక్కువ సమ యం దానిలో గడపాలనే నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/