ఫ్లైఓవర్ బ్రిడ్జి పై కారు బీభత్సం: ఒకరు మృతి
డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణం

Chiraala: ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఒక కారు బీభత్సం చేసింది .. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ దుర్ఘటన జరిగింది. కారు అదుపు తప్పి మూడు ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి అక్కడికక్కడే చెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణమని నిర్దారించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు చీరాల మండలం ఈపూరుపాలేం విఆర్వో అశోక్ గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/