సిరియాలో మరోసారి బాంబు పేలుడు..14 మంది మృతి

Car bombing in Syria's Azaz
Car bombing in Syria’s Azaz

సిరియా: సిరియాలో మరోసారి పేలుళ్లలు జరిగాయి. రెండు రోజుల క్రితం జరిగిన బాంబు పేలుడులో పది మంది మరణించిన విషయం మరువక ముందే మరో కారు బాంబు జరిగింది. ఈ ఘటన సిరియాటర్కీ సరిహద్దు రాష్ట్రం అలెప్పోలోని అజాజ్‌ నగరంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో కనీసం 14 మంది మరణించగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం మార్కెట్లన్నీ రద్దీగా ఉండడంతో సామాన్య ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. కారులో అమర్చిన డిటోనేటర్లతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. బాంబు ధాటికి సమీపంలో దుకాణాలన్నీ ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/