కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు : అయిదుగురు మృతి

కారు దహనం

Car Accident
car burning in flames

Kakinada: జగ్గంపేట మండలంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  గోకవరం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.

వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మల్లిసాల గ్రామం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. విద్యుత్ తీగలు కారుపై పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురూ సంఘటనా స్థలంలోనే మరణించారు. కారు మంటల్లో దహనం అయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/