‘నిర్భయ’ దోషుల మరణశిక్ష మరోసారి వాయిదా
ఇంకెంతకాలం మాకు ఈ అన్యాయం
నిర్భయ తల్లి ఆశాదేవి ఆక్రోశం

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరిశిక్ష అమలు మరో సారి వాయిదాపడింది. ఢిల్లీ కోర్టు న్యాయ మూర్తి దోషులను 3వ తేదీ మంగళవారం శిక్ష అమలు తదుపరి ఉత్తర్వులవరకూ వాయిదా వేసినట్లు వెల్లడించారు.
నింది తుల్లో ఇద్దరు తమ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పిటిషనున్ల వేయడం, రాష్ట్రపతి పెట్టుకున్న క్షమాబిక్షపిటిషన్లను వెనువెంటనేపరిశీలించి పిటిషన్‌ను రాష్ట్ర పతి తిరస్కరించడంజరుగిన క్రమంలో తాజాగా ఢిల్లీలోని పాటియాలాహౌస్కోర్టు నిందితుల ఉరిని తదుపరిఉత్తర్వులు వెలు వరించేంతవరకూ వాయిదావేసింది. పవన్‌గుప్తా క్షమాబిక్ష పిటిషన్ పెం డింగ్‌లో ఉంది. పవన్‌కుమార్ గుప్తాదా ఖలు చేసిన క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్ర పతి కోవింద్ సోమవారం తిరస్కరించారు. దీనితోమంగళవారం ఉదయం ఉరి శిక్షకు అమలుపై కొంత సందిగ్ధత కొనసా గుతూనే వచ్చింది.
నిర్భయదోషులు నలు గురుదాఖలుచేసిన క్షమాబిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. పవన్దాఖలుచేసిన క్యూరేటివ్పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనకువిధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలన్న పవన్విజ్ఞప్తిని జస్టిస్‌ఎన్‌వి రమణ ధర్మాసనం తోసిపుచ్చింది.
దోషికి ఉరిశిక్ష విధించడం సరైనదేనని అభిప్రాయపడింది. సుప్రీం పిటిషన్‌ను తిరస్కరించడంతో పవన్లాయర్ ఎపిసింగ్ క్షమాబిక్ష పిటిషన్‌ను దాఖలుచేసారు. మరోసారి రాష్ట్రపతి ఈ పిటిషన్‌ను కూడా తిరస్కరించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/