దేశ ప్రజలను మతాల పేరుతో విడదీయడం భావ్యం కాదు

ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేసిన అమర్త్యసేన్‌

amartya sen
amartya sen

న్యూఢిల్లీ: ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారి 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంపై నోబెల్‌ విజేత, భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌ విచారం వ్యక్తం చేశారు. భారత్‌ ఒక సెక్యులర్‌ దేశం. ఇక్కడి జనాలను మతాల పేరుతో విడదీయడం భావ్యం కాదన్నారు. ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాకాండను ఉద్దేశించి అమర్త్యసేన్‌ మాట్లాడుతూ రాజధానిలో చోటుచేసుకున్న హింసను అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు అసమర్థులయ్యారా? లేక ప్రభుత్వం వైఫల్యం చెందిందా అనేది తెలియాల్సింవుందన్నారు. దేశ రాజధానిలో ఇటువంటి ఘటనలు జరగడం బాధకరమని అన్నారు. అయితే ఢిల్లీలో చోటుచేసుకున్న ఆందోనల్లో అధికసంఖ్యలో ముస్లిములే బాధితులుగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని హిందువులను, ముస్లింలను వేరుచేయడం తగదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/