అధిక ఫీజులను అదుపు చేయలేరా?

school fees
school fees

ఆ ర్థికస్తోమత లేనిదే విద్యను పూర్తి చేయడం సాధ్యంకాని దురదృష్టపు పరిస్థితులు దాపురించాయి. నాణ్యమైన విద్య పేరుతో రకరకాలుగా తల్లిదండ్రులను మాయ మాటలతో మోసంచేసి ఫీజులు వసూలు చేయడం కొన్ని విద్యాసంస్థలకు పరిపాటిగా మారిపోయింది.ఆధునిక విధా నాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి బోధన చేస్తు న్నామని,ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నామని చెబుతూ విద్యార్థుల సంఖ్యను పెంచు కునే ప్రయత్నం నిరాటంకంగా జరుగుతున్నది. నూతన విద్యాసంవత్సరం ఇంకా ఆరంభంకాలేదు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షలుకూడా పూర్తికాలేదు. అయినా అప్పుడే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజులవసూళ్ల కార్యక్రమం ఆరంభమైంది.తెలుగురాష్ట్రాల్లో అనేక విద్యాసంస్థలు సౌకర్యలేమితో కొట్టుమిట్టాడు తున్నాయి. ఇరుకుగదుల్లో విద్యాబోధన చేస్తూ కనీసం ఆట స్థలాలు లేని పరిస్థితిలో మగ్గుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న జాబితాలో హైదరాబాద్‌నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయరాదని,అలావసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పాలకులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలకు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ అవేమి పట్టించుకోకుండా ఈ చట్టాలు, అధికారులు తమను ఏమీ చేయలేరన్నట్లుగా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీ ఎల్‌కెజి నుంచే ఆరంభమవ్ఞతున్నది. ఎల్‌కెజిలకు లక్షరూపాయలకుపైగా ఫీజులు వసూలు చేసే పాఠశాలలు పుట్టుకొచ్చాయి. పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను ఇంటర్‌వ్యూలు చేసి ఆర్థికస్తోమతను అంచనా వేసుకొని స్వీకరిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు లోబడే తాము సీట్లు కేటాయిస్తున్నట్లు నామమాత్రపు రసీదులు ఇస్తున్నారు. ఈ దోపిడీని భరించలేక వారు అడిగిన ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి గతంలో ఆందోళన కూడా చేశారు. ఏయే విద్యాసంస్థలు ఇలా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయో కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలతో ఫిర్యాదు కూడా చేశారు. తల్లిదండ్రులతో సంబంధిత అధికారులు, మంత్రులు చర్చలు కూడా జరిగాయి. అయితే శతకోటిదరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఈ ఫీజులు రకరకాల పేర్లతో వసూలు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం రూపొందించిన చట్టం కానీ, నిబంధనలు కానీ అలాంటి వారిని ఏమీ చేయలేకపోతున్నాయి. పుస్తకాల మోత కూడా పెరిగిపో యింది. ఇందులో కూడా ఆదాయం చూసుకుంటున్న సంస్థలు లేకపోలేదు. బాలబాలికలకు పుస్తకాల బరువ్ఞ, తల్లిదండ్రులకు ధనభారం మోయలేనంతగా పెరిగి పోయింది. ఈ విద్యావ్యాపారం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాకపోయినా రానురాను పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. ఒకనాడు ప్రభుత్వ పాఠశా లలే కానీ ప్రైవేట్‌ బడులులేవ్ఞ.ఎక్కడో పట్టణాల్లో అక్కడ క్కడ ప్రైవేట్‌ బడులు నడిచేవి. వాటిలో కూడా వ్యాపార ధోరణులు కన్పించేవికావ్ఞ. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం సేవాదృక్పథంతో ఆ విద్యాసంస్థలు ప్రజలకు సేవలు అందించేవి. నిర్వాహకులు సామాజిక బాధ్యతగా భావించి బడులు నడిపేవారు. అందుకే చట్టాల అవసరం అంతగా తలెత్తలేదు. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఎయిర్‌కండిషన్‌రూమ్‌లు, బస్సులు, డ్రస్సులు అంటూ ప్రతిదాంట్లో వ్యాపార ధోరణితో కొన్ని యాజమాన్యాలు వ్యవహరించడం అత్యంత దురదృష్ట కరం. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో 1994లో పాఠశాలల గుర్తింపునకు సంబంధించి జివోనెం.1 తీసుకు వచ్చారు.దానిప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థలకు వచ్చే ఆదా యంలో ఐదుశాతం మాత్రమే యాజమాన్యాలు ఆర్జించా లి.వచ్చినఆదాయంలో 15శాతం నిర్వాహణ ఖర్చుకు, 15 శాతం నిర్మాణ ఖర్చుకు, 50శాతం టీచర్ల జీతభత్యాలకు, మరో 15శాతం ఉపాధ్యాయులు గ్రాట్యుటీ,పిఎఫ్‌, బీమా తదితర కేటాయించాలి. అలాగే దరఖాస్తు ఫీజు వంద రూపాయలు వసూలు చేయాలి. ప్రవేశఫీజు ఐదువేల రూపాయలు వసూలు చేయాలి. ఒకవేళ విద్యార్థిబడి మానితే ప్రవేశ రుసుం తిరిగి విద్యార్థికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పాఠశాలలు నిబంధన లను పాటిస్తున్నా యో ప్రత్యేకంగా చర్చించాల్సిన పని లేదు.ఇక అలాగే కార్పొరేట్‌ విద్యాసంస్థలను నియంత్రిం చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో జి.వో నెం.91 తీసుకువచ్చారు. జిల్లాకలెక్టర్‌ ఛైర్మన్‌గా ఫీజుల నియంత్రణ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీపరిస్థితులను పరిశీలించి సమీక్షించి ప్రతి మూడేళ్లకు ఒకసారి ఫీజులు పెంచే వీలు కల్పించాలి. ఒకవేళ ఏటా రుసుములు పెంచాలనుకుంటే ఆదాయవ్యయాలను చూపించి కమిటీ అనుమతితో ముందుకువెళ్లాలని నిబంధ నలను రూపొం దించారు. కానీ అనేక విద్యాసంస్థల యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం గా పెంచుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం అమలు లోకి వచ్చిన అనంతరం 2010 జులై 30న ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఏ మేరకు ఫీజులు వసూలు చేయాలో స్పష్టమైన నిబంధనలతో జి.వోనెం.42ను తీసుకువచ్చా రు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రైవేట్‌ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టేందుకు తిరుమలరావ్ఞ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.ఆ కమిటీ అధ్య యనం అనంతరం జోనల్‌ స్థాయి రుసుం నియంత్రణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ చట్టాలు కానీ, నిబంధ నలు కానీ అనేక విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. మూడోకంటికి తెలియకుండా జరుగుతున్న రహస్యమేమీ కాదు.ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవాల్సిన అధి కారగణం మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికైనా పాలకులు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. విద్యను వ్యాపారంగా చూసేవారిపై ఉక్కుపాదం మోపాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/