పీవీపీ ఆస్తులను వేలం వేయనున్న కెనరా బ్యాంకు!

Potluri Varaprasad
Potluri Varaprasad

అమరావతి: తమకు చెల్లించాల్సిన రూ. 148.90 కోట్ల మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు వైఎస్‌ఆర్‌సిపి నేత పొట్లూరి వరప్రసాద్‌ ఆస్తులను వేలం వేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధమైంది. గతంలో పీవీపీ కేపిటల్‌ లిమిటెడ్‌ సంస్థ కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఆ బకాయి వడ్డీతో కలిపి రూ.148.90 కోట్లకు చేరింది. ఎన్ని నోటీసులు పంపినా, డబ్బు చెల్లించకపోవడంతో, ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/