టోక్యో ఒలంపిక్స్‌ నుంచి తప్పుకున్న కెనడా

కరోనా ప్రభావంతోనే ఈ నిర్ణయం

 i.o.c
IOC looking at postponing Tokyo Olympics

కెనడా: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ తరుణంలో.. ఆటల కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమంటూ కెనడా దేశం టోక్యో ఒలంపిక్స్‌ నుంచి తప్పుకుంది. ఒలంపిక్స్‌ నుంచి తప్పుకుంటున్నట్లు కెనడా ఒలింపిక్‌ కమిటీ, మరియు పారాలింపిక్‌ కమిటీలు తేల్చి చెప్పాయి. కాగా గత రెండు రోజుల నుండి ఒలంపిక్‌ వాయిదా వేయాలని వివిధ దేశాలకు చెందిన ఒలింపిక్‌ సంఘాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్‌ నిర్వహిస్తారా లేదా అనే అనుమానం తలెత్తుంది. ఇదిలా ఉండగా ఈ క్రీడలను నిర్వహించాలా.. వద్దా.. అని నెలకొన్న సందిగ్దంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని జపాన్‌ ప్రదాని షింజో అబే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/