కెనడాలో 15 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

ఒట్టావా: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచంలో కలకలం రేపుతున్నది. దక్షిణాఫ్రికాలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా మహమ్మారి క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తున్నది. కెనడాలో ఈ తరహా కేసులు 15కు చేరాయి. దేశంలో తొలికేసు గతనెల 28న నమోదయింది. ఆఫ్రికా దేశమైన నైజీరియా నుంచి ఒంటారియకు వచ్చిన ఇద్దరికి ఈ వైరస్‌ సోకింది.

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు 15కు పెరిగాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈనేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న 50 ఏండ్లు పైబడినవారికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు నేషనల్‌ అడ్వైజరీ బోర్డు సూచించిందని వెల్లడించారు. కాగా, వారిలో 12 ఏండ్ల చిన్నారి కూడా ఉందని, ఆమె ఈ మధ్యే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిందని చీఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ థెరిసా టామ్‌ తెలిపారు. టొరంటోలో మూడు ఒమిక్రాన్‌ కేసు నమోదయిందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. అందులో ఇద్దరు నైజీరియా నుంచి, మరొకరు స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చారని వెల్లడించారు. కాగా, ఆఫ్రికాతోసహా అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై కెనడా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/