పేద దేశాలకు కోటి వ్యాక్సిన్‌ డోసులు: కెనడా ప్రధాని

మాంట్రియల్: పేద దేశాలకు భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్‌ డోసులను అందించనున్నట్లు కెనడా ప్రకటించింది. 2022 చివరినాటికి 2 వందల మిలియన్లకు సమానమైన వ్యాక్సిన్‌ డోసులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందిస్తామని ప్రధాని జస్టిన్‌ ట్రుడో స్పష్టం చేశారు. ఇందులో కోటి (10 మిలియన్ల) మోడర్నా వ్యాక్సిన్‌ డోసులను వీలైన తొందరగా సరఫరా చేస్తామని వెల్లడించారు.

పారిస్‌లో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో ఈ మేరకు ప్రకటించారు. అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ కెనడాలో వ్యాక్సిన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా 40 మిలియన్ల డోసులను ప్రభుత్వం ఆర్డర్‌ చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/