కేంద్ర ప్యాకేజీతో తెలంగాణకు ఉపయోగం ఉండదా?

ప్యాకేజీ పై ప్రధానిని కెసిఆర్‌ విమర్శించడం తగదు

kishanreddy
kishanreddy

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ కేంద్ర ప్యాకేజీపై చేసిన విమర్శలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..కెసిఆర్‌ ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ప్రధాని వెనుక యావత్ దేశం ఉందని, ప్రధానిని కెసిఆర్‌ విమర్శించడం తగదని అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవద్దని కెసిఆర్ కు కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణ ప్రజలకు లబ్ధి ఉంటుందా? లేదా? అనే ప్రశ్నకు కెసిఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఉన్నంతలో కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న పంటల విధానాన్ని బిజెపి వ్యతిరేకించలేదని… అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/