శానిటైజర్‌లను ముక్కు నోటి చుట్టూ రాసుకోవచ్చా?

ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

shanitaizer
shanitaizer

న్యూయార్క్‌: ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్‌ భయపెడుతుంది. ఇలాంటి సమయంలో శానిటైజర్స్‌ను మనం ముక్కు, నోటి చుట్లూ ఎందుకు రాసుకోవద్దు అంటూ ఓ వ్యక్తి డబ్ల్యూహెచ్‌వోని ప్రశ్నించాడు. అదేమిటంటే మనం సబ్బుతో చేతులు కడుక్కుంటే చేతులపై ఉండే కరోనా వైరస్‌ తొలగిపోతుందని అందరికి తెలిసిందే. కాని అదే సబ్బుతో మనం ముక్కు, నోరు చుట్టూ రాసుకుంటూ.. ముఖం శుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా మనం శానిటైజర్‌ని కూడా చేతులపై ఉండే కరోనా వైరస్‌ని చంపేందుకు ఉపయోగిస్తాం. మరి అదే శానిటైజర్‌ను మనం ముక్కు, నోటి చుట్టు ఎందుకు రాసుకోకూడదంటూ ఓ వ్యక్తి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెఛ్‌వో)ని ప్రశ్నించాడు. దీనికి డబ్ల్యూహెచ్‌వో సమాధానమిస్తూ.. హ్యండ్‌ శానిటైజర్‌, ఆల్కహల్‌, క్లోరిన్‌ వంటి వాటిని శరీరంపై చల్లుకుంటే ప్రమాదమని.. ఇది శరీరంలో ఉండే వైరస్‌ని చంపలేవని.. ఆల్కహల్‌, క్లోరిన్‌ వంటివి ప్రదేశాలపై ఉండే వైరస్‌లను తరిమేసేందుకే వాడుతారని తెలిపింది. ఇలాంటి విషయాలలో డాక్టర్‌ల సూచనల మేరకే ఉపయోగించాలని, ప్రయోగాలు చేయకపోవడమే మంచిదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/