బిజెపి ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్‌

BJP office
BJP office

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడం కలకలం రేపింది. కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌కు శనివారం ఫోన్‌ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులెవరో ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు తేల్చారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కర్ణాటకలోని మైసూరు నుంచి ఈ ఫోన్‌ కాల్‌ వచ్చినట్లు గుర్తించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/