కాలీఫ్లవర్‌ ఊరగాయ

Califlower Pickle
Califlower Pickle

ఊరగాయలు అంటే మామాడి, టమోట అనుకుంటారు. కూరగాయలతో పలు ఊరగాయల్ని పెట్టుకోవచ్చు. వారం, పదిరోజులకు సరిపోయేంతగా పచ్చళ్లను పెట్టుకోవచ్చు. కాలీఫ్లవర్‌, దోశకాయ, వంకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ ఇలా అన్ని కూరగాయలతో పచ్చళ్లను తయారు చేసుకోవచ్చు. ఇవి పెట్టుకోవడం కూడా చాలా సులభమే. పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. మామిడికాయ పచ్చడి, ఊరగాయలు అయితే వేలకువేలు ఖర్చుపెడితే తప్ప ఇంటిల్లిపాదికి ఆ పచ్చళ్లు సరిపోతాయి. అలాగని ఎప్పుడూ వాటినే తిన్నా కూడా బోర్‌ కొడుతుంది. కాబట్టి కొన్ని రకాల కూరగాయలతో కూడా పచ్చళ్లు పెట్టుకోవచ్చు. కాలీఫ్లవర్‌ ఊరగాయను చూద్దాం.

కావలసినవి:
నాలుగు కప్పులు బాగా సన్నగా తరిగిన కాలీఫ్లవర్‌, కప్పు-కారం
పావు కప్పు-ఆవపిండి, అరకప్పు-నిమ్మరసం, మెంతిపిండి-ఒక చెంచా
తగినంత నూనె, ఉప్పు-ఒక కప్పు, చిటికెడు పసుపు

తయారుచేసే విధానం:
ముందుగా కాలీఫ్లవర్‌ ముక్కల్ని ఒక బేసిన్‌లో వేసి, అందులో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి చేర్చి బాగా కలపాలి. అందులో నూనె తగినంతగా పోసి కలపాలి. ఆ తరువాత నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ఒకరోజు పొడిసీసాలో భద్రపరిచి, మరునాటి నుంచి వాడుకుంటే ఆవకాయ రుచులూరుతూ నోరూరిస్తుంది.