ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కు కేబినెట్‌ హోదా

Devireddy Sriinath

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. నవంబర్‌ 21న ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజం వృత్తిలో అపార అనుభవమున్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com