కొత్త సచివాలయంపై సిఎం కు నివేదిక

cm kcr-ministers
cm kcr-ministers

హైదరాబాద్ : కొత్త సచివాలయం నిర్మాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు నివేదిక సమర్పించింది. గురువారం ఉదయం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం ప్రతినిధుల బృందం సిఎం కెసిఆర్‌ను కలిసి నివేదిక సమర్పించింది. అంతకు ముందు కొత్త సచివాలయం ఏర్పాటుపై సంబంధించి వివిధ శాఖల ఇఎన్‌సిలు మంత్రి వర్గ ఉపసంఘానికి నివేదిక ఇచ్చాయి. ఆ నివేదికను అనుసరించుకొని మంత్రివర్గ సంఘం తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్ అండి బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/