క్యాబేజి రేకులతో బజ్జీలు

వంటింటి రుచులు

Cabbagae Bajji
Cabbagae Bajji

కావలసిన పదార్థాలు : శనగపిండి – 500 గ్రాములు
మైదాపిండి – 300 గ్రాములు
బియ్యంపిండి – 200 గ్రాములు
ఉప్పు -కొద్దిగా
బేకింగ్‌ సోడా – చిటికెడు
నూనె – వేయించటానికి సరిపడ
కారం 1 స్పూను
క్యాబేజి రేకులు -కొద్దిగా

తయారు చేయు విధానం

క్యాబేజి రేకులను మీడియం సైజులో ముక్కలు కోసి ఉంచుకోవాలి. తరువాత శనగపిండి, బియ్యంపిండి, మైదా పిండి మూడింటిని బాగా కలిపి అందులో బేకింగ్‌ సోడా, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి.

పావ్ఞగంట తరువాత పిండి బాగా నానిన తరువాత క్యాబేజి ముక్కలను అందులో వేసి బాండీలో నూనె వేసి అది కాగిన తరువాత క్యాబేజి ముక్కలను తీసి అందులో వేసి కొద్దిగా వేగిన తరువాత తీసి మరలా నూనెలో వేసి తీసివేయాలి.

ఇవి రెండు రోజులు నిలువ ఉంటాయి.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health/