ఏపీ ప్రభుత్వం ఫై నిర్మాత సి. కళ్యాణ్ ఆగ్రహం

ఏపీ సర్కార్ ఫై చిత్రసీమ మండిపడుతుంది. ఇప్పటికే కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న చిత్రసీమ..ఇప్పుడు ఏపీ సర్కార్ సినిమా టికెట్ ధరలు తగ్గించడం తో మరింత భారం అవుతుంది. ఇప్పుడిప్పుడే చిత్రసీమ కు కళ వస్తుందని అనుకుంటున్నా నేపథ్యంలో టికెట్స్ ధరలు తగ్గించడం అనేది దారుణమని సినీ ప్రముఖులు అంటున్నారు.

తాజాగా నిర్మాత సి కళ్యాణ్ టికెట్స్ ధరల ఫై స్పందించారు. ‘‘టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ నా వస్తువు నేను తయారు చేసుకుని, నా వస్తువు రేటు నేను ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా? వద్దా? సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. కానీ మరీ ఇంతగా తగ్గించడం మాత్రం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవరూ సంతోషంగా లేరని..కళ్యాణ్ అన్నారు.