టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం..ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్ వేదిక వరకు వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఆసక్తి కనపరుస్తుంది. ఈ ఉప ఎన్నిక ముఖ్యముగా బిజెపి vs టిఆర్ఎస్ మధ్య కొనసాగుతుంది. బిజెపి నుండి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బరిలో నిలవడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని బిజెపి సన్నాహాలు చేస్తుంటే..ఆ ఛాన్స్ బిజెపి ఇవ్వకూడదని టిఆర్ఎస్ చూస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నిక ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టిఆర్ఎస్. గత కొద్దీ రోజులుగా మునుగోడు లో నేతలంతా ప్రచారం చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఈ ఉప ఎన్నిక ప్రచారం టీ 20 వరల్డ్ కప్ వేదిక వరకు వెళ్లింది. గురువారం జరిగిన ఇండియా- నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాట్ ఇందుకు వేదికైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు కూడా పెద్ద ఎత్తున భారతీయులు హాజరవుతూ.. ఇండియన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మ్యాచ్‌లకు రావటమే కాదు.. గ్యాప్‌లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలకు కేరాఫ్ అట్రక్షన్ అవుతూ.. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందులో తెలంగాణకు చెందిన వాళ్లు హైలెట్‌గా నిలుస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే మొన్న ఇండియా- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మద్దతుగా ఓ అభిమాని ప్లకార్డులు ప్రదర్శిచి హల్చల్ చేయగా.. గురువారం జరిగిన ఇండియా- నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఏకంగా మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రచారాన్నే నిర్వహించారు కొందరు అభిమానులు. చేతిలో బీజేపీకి మద్దతుగా పోస్టర్లు ప్రదర్శించారు. మునుగోడు ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలంటూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. మునుగోడు అభివృద్ధి బీజేపీతో సాధ్యమని.. అందుకోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఓటేసి గెలిపించాలంటూ.. నానా హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.