ఆరోగ్యానికి మజ్జిగ పులుసు

ఆహారం-ఆరోగ్యం

Buttermilk broth for health
Buttermilk broth for health

ప్రస్తుత పరిస్థితిలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా వంటింట్లో అందుబాటులో ఉండే మజ్జిగను ఉపయోగించి పులుసు తయారు చేసుకోవచ్చు.

పెరుగు లేదా మజ్జిగలో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పులిసిన మజ్జిగలో ఇది రెట్టింపు ఉంటుంది.

ఇది పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను నశింపచేసి మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది.

శరీరంలోకి ఎలాంటి వైరస్‌లు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మజ్జిగలోని ల్యాక్టిక్‌ ఆమ్లం శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది.

తీసుకున్న ఆహారం త్వరగా జీరణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఇందులో కొవ్వు, క్యాలరీల శాతం కూడా తక్కువే.

శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

ఇన్ని ప్రయోజనాలున్న దీంతో పులుసు పెట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారా మరి! పులుసు ఎలా చేయాలంటే రెండు గ్లాసుల మజ్జిగ తీసుకుని దాంట్లో సరపడా ఉప్పు వేసి పక్కన పెట్టాలి.

ఉల్లిపాయను సన్నగా పొడవుగా తరిగి రరెండు పచ్చిమిరపకాయలను నిలువుగా చీల్చాలి. రెండు ఎండుమిర్చిలను ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి.

Buttermilk broth for health

స్టవ్‌ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె పోసి వెడయ్యాక చెంచా చొప్పున ఆవాలు, జీలకర, మెంతులు వేయాలి.

అవి చిటపడలాడాక ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిచ్చి ముక్కలు వేయాలి.
చివరగా ఇంగువ, కాస్త పసుపు వేసి ఇలా తయారుచేసిన పోపును మజ్జిగలో కలపాలి.

మజ్జిగను వేడిచేస్తే దాంట్లోని పోషకాలు నశిస్తాయి. కాబట్టి వేయించిన పోపునే మజ్జిగలో కలిపితే పోషకాలు మనకు పూర్తిస్థాయిలో అందుతాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/