విద్య పేరుతో ఇంత వ్యాపారమా?

విద్యనందించడం అంటే అది ఒక గొప్పవరంగా ఉండేది ఒకప్పుడు. ఇది సేవా రంగంలోకి వస్తుంది. కానీ నేడు విద్యతో వ్యాపారవేత్తలు చేస్తున్న వ్యాపారాలు చూస్తుంటే ఇలా కూడా వ్యాపారం చేయవచ్చా! అనే ఆశ్చర్యం కలుగకమానదు. రోజురోజుకు వారి ఆలోచనలు పరిణితి చెంది నూతన ఒరవడికి నాంది పలుకుతూ సగటు మానవ్ఞన్ని ఆశ్చర్యానికి లోను చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

School Admission Fees

నేడు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు అంటేనే అధిక ఫీజులు తీసుకుంటారు, చదువ్ఞ బాగా చెబుతారు అనుకుంటారు. ఇంకొందరు అధిక ఫీజులతో లాభాలు గడించే వ్యాపారం చేస్తున్నారని భావిస్తారు. కానీ వారు అడుగడుగున చేసే ప్రతి పనికూడా వ్యాపారంతో కూడుకొని ఉన్నాయనే నిజాలు తెలిస్తే అవాక్కుకు గురికాకమానదు. ముందుగా ఏ యాజమాన్య మైన పాఠశాల భవనం, అందులోని గదులు, పరిసరాలు తదితర సామాగ్రి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షింపచేస్తుంది.

రంగురంగుల భవనాలు, పాలరాతితో కూడిన నేల, లైటింగ్‌, చల్లని గదులను ఏర్పాటు చేసి హాస్టల్‌ సౌకర్యం, పరిశుభ్రతకు మారుపేరులా కనిపించేలా తలపిస్తారు. ఉదాహరణకు ఎంత బడ్జెట్‌ ఎక్కువ పెట్టి సినిమా తీస్తే అంత ఎక్కువ లాభం వస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా వీటన్నింటిని పెట్టుబడిగా భావిస్తారు. పాఠశాల నచ్చి పిల్లలకు అందులో ప్రవేశం కల్పించాలనుకుంటే ముందుగానే డొనేషన్స్‌, అడ్మిషన్స్‌, ఫీజులని, అధికమైన రీతిలో పాఠశాల ఫీజుల వివరాలు చెల్లించాల్సిన సమయాలను ముందుగానే వివరిస్తారు.

ప్రస్తుత తరుణంలో ఏ పాఠశాలను పరిశీలించిన మూడు రకాల యూనిఫారంలు కల్పిస్తారు. మరికొన్ని పాఠశాలలో తరగతుల వారీగా యూనిఫారంలను చూడవచ్చు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తీసుకొని ఈ తరహా వ్యాపారం చేసేవారిని కలిసి, తమ పాఠశాల పేరు షేర్ట్‌పై వచ్చేటట్లు డీల్‌ మాట్లాడుకోని, అక్కడవారు చెల్లించిన వాటికంటే అదనంగా రెండు రెట్ల ధరతో విద్యార్థులకు అమ్మడం వలన ఖచ్చితంగా ప్రతి విద్యార్థి తీసుకోవాల్సిందే.

అలాగే వాటిని పాఠశాల యాజమా న్యమే అమ్ముతుంది. కావ్ఞన ఇలాంటి వ్యాపారం వలన ఎంతో లాభాన్ని పొందినవారవ్ఞతారు. వీటితోపాటు ప్రతి విద్యార్థిటై, బెల్ట్‌, పాఠశాల గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అవి ఎక్కడా లభించవ్ఞ. ఇదో రకమైన వ్యాపారం. వ్యాపారమం టేనే లాభాల కోసం చేసేది. నర్సరీ నుండి మొదలుకొంటే ఐదోవ తరగతి అన్నీ పాఠ్యపుస్తకాలు సైతం పాఠశాల కార్యాలయాలలోనే లభిస్తాయి.

వాటి ధర వింటేనే పేదోడి గుండె బెత్తడు జరుగు తుంది. వాటితోపాటు 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌, గైడ్స్‌ను ఆయా పాఠశాలల పేర్లతో ముద్రిస్తాయి. కావ్ఞన వాటిని ప్రతి ఒక్కరు తప్పక తీసుకోవా ల్సిందే. అధిక లాభం చేకూర్చే పనులలో ఇదొకటని చెప్పవచ్చు.

ఐఐటి, ఫౌండేషన్‌ అంటూ ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులందరు తీసుకోవాల్సిన మరొక పుస్తకం. దీనితోపాటు పరీక్షలు రాయడానికి కావాల్సిన తెల్లకాగితాలపైన తమ పాఠశాలకు సంబంధించిన వివరాలను తెలుపుతూ ముద్రించి అమ్మడం ఇలా ప్రతి దానికి తమ కార్యాలయంలో కొనేలా జాగ్రత్తగా అధిక ధరలకు అమ్ముతూ వ్యాపారం చేస్తూ అధిక లాభాలను పొందడమెలా అని ఆలోచిస్తుంటారు కాబోలు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల రాకపోకలపై రవాణా సౌకర్యాలను సైతం కల్పిస్తూ అధిక ఫీజులు రాబట్టడం, సెలవ్ఞ దినాలలో వాటితో సైతం వ్యాపారం చేయడం గమనించవచ్చు.

School Fees

కొన్ని ప్రైవేట్‌పాఠశాలలో చదివే గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్సుపాసులు కల్పిస్తే వాటిపై సంతకానికి సైతం కొంత డబ్బు తీసుకునే యాజమాన్యాలున్నాయ నడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. కొన్ని పాఠశాలలు ప్రత్యేకంగా హాస్టల్స్‌ నడుపుతుంటాయి. నాణ్యతదృష్ట్యా, పరిశుభ్రత దృష్ట్యా విద్యార్థుల తల్లిదండ్రులకు ఏవో మాటలు చెప్పి అధిక ఫీజులు లాగుతున్నారు.

పాఠశాలలో జరిపే కొన్ని వెడుకలుంటాయి. వాటివల్ల కూడా లాభాలెలా రాబట్టుకోవాలో వీరిని చూస్తే తెలుస్తుంది. ఇంకా పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చే వీడుకోలు కార్యక్రమంలో భాగంగా ఇరు తరగతుల నుండి వచ్చే సొమ్ములో సైతం కొంత సొమ్మును యాజమాన్యానికి ధారాదత్తం చేసుకోకతప్పదు. అన్ని లెక్కలు తప్పుల తడకనే. అది కేవలం అందులో పనిచేసే ఉపాధ్యాయులకే తెలుసు.

ఇదిలావ్ఞంటే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు లేట్‌ మార్క్‌తో, సెలవ్ఞలు తీసుకోకుండానే తమ జీతాలలో కొంత వదులుకోవాల్సి వస్తుంది. ఎన్ని సెలవ్ఞలు తీసుకున్నా సిలబస్‌ పూర్తి చేసిన తర్వాత వారిని ఇంకొంత ఒత్తిడికి గురిచేస్తూ కొంత సొమ్మును లాగాల్సిందే. ఇదంతా ఒక్క ఎత్తు అయితే విద్యార్థుల నుండి 12 నెలల ఫీజు వసూలు చేసి, పది నెలల జీతాన్ని ఉపాధ్యాయులకివ్వడం, మరికొన్ని పాఠశాలలో చివరి నెలల జీతాలను ఆపి, వచ్చే సంవత్సరానికి ఇస్తామనే షరతులు పెట్టి, ఆపేసిన ఉపాధ్యాయుల జీతాలను సైతం వీలైనంత లాక్కోవడానికి ప్రయత్నించే యాజమాన్యానికి ఇది కూడా వ్యాపారమే.

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం కేవలం విద్యార్థులు చెల్లించే ఫీజులపైనే ఆధారపడకుండా ఇలా ఎన్నో మార్గాలను సృష్టించుకొని వ్యాపారం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాయి.

అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు అలా కాకపోయినా ఎక్కువ శాతంలో అలానే ఉంటాయన్నది వాస్తవం. కనుక ప్రభుత్వమే ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక బాధలను అర్థం చేసుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, పరిష్కార మార్గాలను సూచించాలి.

  • పోలం సైదులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/