లోయలో పడిన బస్సు.. 16 మంది మృతి

కులు నుంచి సయంజ్ కు బస్సు వెళ్తుండగా ప్రమాదం

bus-falls-into-gorge-in-himachal-pradesh/

సిమ్లాః హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి.. 16మంది మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదయం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సు తుక్కుతుక్కయింది.

ఈ ఘటనపై కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ మాట్లాడుతూ… సయంజ్ కు బస్సు వెళ్తున్న క్రమంలో ఉదయం 8.30 గంటలకు జంగ్లా గ్రామం వద్ద ప్రమాదం సంభవించిందని చెప్పారు. జిల్లా అధికారులు, రెస్క్యూ టీములు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారని చెప్పారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలించామని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/