రహదారిపై బస్సు ప్రమాదం.. తీవ్ర గాయాలు

Bus accident
Bus accident

రంగారెడ్డి: మదనపల్లి రోడ్డులో మంగళవారం ఉదయం బస్సు బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలో జరిగింది, కాగా ప్రైవేటు సంస్థకు చెందిన ఈ బస్సులో 10 మంది గాయాలపాలయ్యారు. ఘటనను గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యలు ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వెల్లడించారు. బస్సును రోడ్డు మీద నుంచి తొలగించేందుకు క్రేన్‌ను ఉపయోగించారు. కాగా ఈ క్రమంలో క్రేన్‌ కూడా బోల్తా పడడంతో మరోక క్రేన్‌ సహాయంతో ఈ రెండు వాహనాలను రోడ్డు పైనుంచి తొలగించారు. ఈ కారణంగా రహదారిలో రెండు గంటలపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/