లోయలో పడ్డ బస్సు…8 మంది మృతి

గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలింపు

road accident
road accident

చింతూరు: తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది.. గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ బస్సు మారేడుపల్లి నుంచి బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/