కేరళలో మత్స్యజాతికోసం శ్మశాన వాటిక!

కేరళ రాష్ట్రంలో పర్యావరణ ప్రేమికుల వినూత్న ప్రయత్నం

Burial-Ground
Burial-Ground

తిరువనంతపురం: కేరళలో మత్స్యజాతికోసం శ్మశాన వాటిక ఏర్పాటు చేసి సమాధులు నిర్మిస్తున్నారు. జల, పర్యావరణ కాలుష్యం కారణంగా కొన్ని రకాల జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందని, వాటికి కూడా సమాధులు నిర్మించి స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన కేరళ రాష్ట్రంలోని పర్యావరణ ప్రేమికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోజికోడ్ జిల్లా బేపూర్ తీరంలో ఓ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. ఈ శ్మశానంలో సముద్రగుర్రం, చిలుకచేప, హేమర్ హెడ్ పార్క్, లేథర్ బ్యాగ్ తాబేలు, దుగాంగ్, షాపిష్, ఈగ్రే, జీబ్రాషార్క్, మిస్ కేరళ గౌరవార్థం ఈ శ్మశానంలో సమాధులు నిర్మిస్తున్నారు. ఆ సమాధులు కూడా ఇనుప చట్రంలో వాడిపారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఉంచి నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు, అంతరించిపోతున్న జలరాశుల గురించి ఒకేసారి అవగాహన కలిగించినట్టవుతుందని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న కోజికోడ్ జిల్లా అధికారులు, బేపూర్ పోర్టు డిపార్ట్ మెంట్ అధికారులు, జెల్లీఫిష్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/