బన్నీ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా

బన్నీ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కోట్లాదిమంది అభిమానులు , ఫాలోయర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈయన నటించే చిత్రాలు కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు మాలీవుడ్ లోను విపరీతంగా ఆడుతుంటాయి. అందుకే అక్కడ బన్నీ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు. సినిమాల్లో హీరోగా కనిపించే బన్నీ..బయట మాత్రం చాల సామాన్య వ్యక్తిగా ఉంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటనే ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.

ప్రస్తుతం బన్నీ ..సుకుమార్ డైరెక్షన్లో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. కరోనా ఉదృతి నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ పడుతూ వస్తుంది. తాజాగా కాకినాడ లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసారు. అయితే రెండు రోజులుగా వర్షాలు పడుతుండడం తో షూటింగ్ మొదలుపెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో బన్నీ అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలలో చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో గోక‌వ‌రంలో రోడ్డు ప‌క్క‌న హోట‌ల్‌లో బ‌న్నీ టిఫిన్ చేయ‌గా, అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా బన్నీ సింప్లిసిటీకి జై కొడుతున్నారు.

Icon Star #AlluArjun was having breakfast at road side tiffin centre near gokavaram.@alluarjun ❤️ #Pushpa pic.twitter.com/25OCuNGRB4— Allu Arjun Fan™ (@IamVenkateshRam) September 13, 2021