బుమ్రా పరిణితి సాధిస్తున్నాడు : రోహిత్‌ శర్మ…

Jasprit Bumrah
Jasprit Bumrah

బెంగుళూరు: ముంబయి ఇండియన్స్‌ పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, యువ ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యాపై సారథి రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా నానాటికీ మరింత పరిణితి సాధిస్తున్నాడని పేర్కొన్నాడు. బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. బుమ్రా ఇప్పుడు మరింత పరిణితి సాధించాడు. ప్రతిరోజు అతడి ప్రదర్శన మెరుగవుతోంది. ఎంతో అంకితభావం చూపిస్తాడు. తన బౌలింగ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు. విరాట్‌, ఎబి క్లాస్‌ ఎలా ఉంటుందో మనకు తెలుసు. వారి భాగస్వామ్యం విడదీసేందుకు బుమ్రా తెలివిగా పనిచేశారని రోహిత్‌ అన్నాడు. పరుగులు చేయాలన్న దాహం హార్థిక్‌ పాండ్యాలో ఉంది. చివర్లో అతడొచ్చి కీలక పరుగులు చేశాడు.కొన్ని పరుగులిచ్చినా మధ్య ఓవర్లలో చక్కగానే బౌలింగ్‌ చేశాడు. చివరి మ్యాచ్‌తో పోలిస్తే అతడి ప్రదర్శన మెరుగైంది. మలింగ సైతం రాణించాడు. అతనిప్పుడు శ్రీలంక సారథి. ప్రపంచకప్‌లో రాణించాలని కోరుకుంటున్నాను. దక్షిణాఫ్రికా నుంచి మంచి ఫామ్‌తో తిరిగొచ్చాడని రోహిత్‌ వెల్లడించాడు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/